ముగ్గురు లష్కరులను కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే.. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ముగ్గురు ముష్కరుల చొరబడ్డారనే సమాచారం అందడటంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
అయితే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందినవారిగా గుర్తించామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వారు ఎవరనేది తెలుసుకుంటున్నామని, ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ తెలిపారు. అయితే గత మంగళ, బుధవారాలలో వరసగా రెండు సార్లు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రత దళాలు మరింత అప్రమత్తమై.. పహారా కాస్తున్నాయి.
