Site icon NTV Telugu

Psycho Husband: బయటపడ్డ భర్త అసలు క్యారెక్టర్.. అలాచేయాలని భార్యకు తుపాకీతో బెదిరింపు

Psycho Husband

Psycho Husband

భార్య భర్తలు అన్నాక కుటుంబంలో గొడవలు సహజం. వారిద్దరి మధ్య అభిప్రాయాలు కుదరక గొడవ పడటం జరుగుతూనే ఉంటాయి. ఇదే అలుసుగా తీసుకుని కొంత మంది భర్తలు.. భార్యల మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. తానే ఇంటికి మహారాజులమని భావిస్తూ.. తాము చెప్పిందల్లా చేయాలని భార్యపై హుకుం జారీ చేస్తుంటారు. ఒక వేళ భార్య మాట వినకపోతే కొన్ని సార్లు హద్దు మీరి బెదిరింపులకు పాల్పడుతుంటారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్త నిజ స్వరూపం బయట పడటంతో భార్య షాక్‌కు గురైంది. ఇలాంటి దారిలోనే ఓ భర్త శృంగారం విషయంలో భార్యపై బెదిరింపులకు దిగాడు. తను చెప్పినట్టు వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఈఘటన మధ్యప్రదేశ్ లోని చోటుచేసుకుంది.

Read also: Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతంలో భార్య భర్తలిద్దురు నివాసం ఉంటున్నారు. భర్త డాక్టర్ గా పని చేస్తుండగా.. భార్య బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తుంది. వీరిద్దరు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయో లేదో అప్పుడే భర్త తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టాడు. వివాహమైన కొంత కాలం వరకే ఈ భార్యాభర్తలు ఆనందంగా గడిపారు. ఇక రోజులు గడిచే కొద్ది భర్త రాక్షసుడిలా తయారయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యతో అసహజ రీతిలో శృంగారం చేయాలని భర్త కోరుకుంటున్నా.. దానికి భార్య మాత్రం భర్త కోరికను కాదంటూ వస్తూ ఉంది. దీంతో.. భర్తకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎన్సోసార్లు చెప్పి చూశాడు.. కానీ భార్య మాత్రం అసహజ రీతిలో శృంగారానికి భర్త మాట వినలేదు. దీంతో భర్త బెదిరించడం మొదలుపెట్టాడు. భార్యను తుపాకీతో బెదిరించి అసహజ శృంగారం చేయాలనుకున్నాడు. అదే పనిగా భార్యను తుపాకీతో బెదిరించి రోజూ అసహజ రీతితో శృంగారం చేయడమే కాకుండా.. తనకు అదనపు కట్నంగా రూ.10 లక్షలు తీసుకు రావాలంటూ వేధింపులకు పాల్పడుతుండటంతో.. విసుగు చెందిన భార్య తట్టుకోలేకపోయింది. తెగించి భర్త చేస్తున్న దారుణంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Superstitious Beliefs: మూఢ నమ్మకాలతో ఊరు ఖాళీ.. తోటల్లో మకాం..

Exit mobile version