Site icon NTV Telugu

Mumbai: ముంబై ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం..బెదిరింపు కాల్..

Mumbai Airport

Mumbai Airport

Threat Call Received To Blow Up Mumbai Airport: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. తనను తాను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిగా చెప్పుకుని విమానాశ్రయాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ముంబై విమానాశ్రయానికి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also: Turkey Earthquake: సందట్లో సడేమియా.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు పరార్..

కాల్ చేసిన వ్యక్తి తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అని పరిచయం చేసుకున్నాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దిన్ ఉగ్రవాదినని పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి, కొన్ని కోడ్ పదాలను ఉపయోగించి అనుమానాస్పద విషయాల గురించి మాట్లాడినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ కాల్ పై ఎయిర్ పోర్టు అథారిటీ వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చింది. బెదిరింపులకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తిపై ఐసీసీ సెక్షన్ 505(1) కింద కేసు నమోదు చేశారు. బెదిరింపు కాల్స్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version