NTV Telugu Site icon

RSS: అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు..బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత ఫైర్..

Rss

Rss

RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్‌సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేనలపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకరించకపోవడంతోనే సీట్లు తగ్గాయనే వాదన నడుస్తోంది.

Read Also: Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్

ఇదిలా ఉంటే, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీజేపీ పేలవమైన పనితీరుకు ‘‘అహంకారమే’’ కారణమని అన్నారు. జైపూర్‌ సమీపంలోని కనోటాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రామభక్తితో మెలగేవారు క్రమంగా అహంకారులుగా మారారు. అయితే, అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, అహంకారం కారణంగా రాముడు 241 వద్దే ఆపాడు’’ అని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 241 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మెజారిటీ మార్కును దాటలేకపోయిందని ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. 2014, 2019లో స్వయంగా మెజారిటీ సాధించిన బీజేపీ ఈ సారి మాత్రం మెజారిటీ మార్కుకు దూరంగా ఆగిపోయారు.

ప్రతిపక్ష ఇండియా కూటమిని ‘‘రాముడికి వ్యతిరేకం’’గా అభివర్ణించారు. రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 వద్ద నిలిపివేశారు. దేవుడి న్యాయం నిజం, ఆనందదాయకం అని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని 20కి పైగా పార్టీలన్నీ కలిసి 234 సీట్లు సాధించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజాసేవలో వినయం యొక్క ప్రాముఖ్యతను బోధించిన కొద్ది రోజుల తర్వాత ఇంద్రేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.