Naravane Book Row: పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే..
- పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ ..
- పబ్లిషర్ ప్రకటనను షేర్ చేసిన నరవాణే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naravane Book Row: మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం తన పుస్తకం ‘‘ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టనీ’’ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలో, మోడీ ప్రభుత్వం చైనాతో ఘర్షణ సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదని ఉందని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నరవాణే మౌనాన్ని వీడారు. ‘‘ఇది పుస్తక స్థితి’’ అని పుస్తక పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోషల్ మీడియా పోస్టును ఆయన షేర్ చేశారు. ‘‘ఈ పుస్తకం ప్రచురణ హక్కులు తమవేనని, పుస్తకం ఇంకా ప్రింటింగ్‌కు వెళ్లలేదని, ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ లేదా ఏ రూపంలోనూ మేము ఎక్కడా విడుదల చేయలేదు’’ అని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఇదే సమయంలో ఇంటర్నెట్లో సర్క్యూలేట్ అవుతున్న అనధికారిక ప్రింట్లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని, వెంటనే వాటిని ఆపాలని చెప్పింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నరవాణే కూడా చెబుతున్నారు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
పార్లమెంట్లో వివాదం:
కొన్ని రోజలు క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం కాపీని చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణ సమయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదనే విషయాలు ఇందులో ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ పుస్తకం అధికారికంగా విడుదల కాలేదని చెబుతూ లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని భాగాలను చదివేందుకు అనుమతించలేదు. మరోవైపు, ఇంకా పబ్లిష్ కాని పుస్తకం అక్రమంగా పంపినీ చేయడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
This is the status of the book. https://t.co/atLtwhJvl0
— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!