World’s Most Corrupt Country: 2024లో ప్రపంచంలో అత్యంత అవినీతి సూచిక(సీపీఐ) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా తొలిస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ నివేదికను వెల్లడించింది. నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం, ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ఈ సూచిక 180 దేశాలు, భూభాగాలకు ర్యాంకులు కేటాయించింది. సున్నా నుంచి 100 వరకు రేటింగ్ ఇచ్చింది.
‘సున్నా’ అత్యంత అవినీతి, ‘100’ అవినీతి రహిత దేశాన్ని సూచిస్తుంది. జాబితా ప్రకారం, 2024లో భారతదేశ స్కోర్ 38గా ఉంది, 2023లో ఇది 39గా, 2022లో 40గా ఉంది. ర్యాంకులను చూస్తే 2024లో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 2023లో(93వ స్థానం) పోలిస్తే మూడు స్థానాలు దిగజారింది. భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో అత్యంత అవినీతి ఉన్నట్లుగా నివేదిక తెలిపింది. పాకిస్తాన్-135, శ్రీలంక-121, బంగ్లాదేశ్-149వ స్థానంలో ఉన్నాయి. చైనా 76వ స్థానంలో ఉంది.
Read Also: Stock Market: మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత.. నష్టాల్లో ముగిసిన సూచీలు
ప్రపంచంలో సూపర్ పవర్స్‌గా ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌లు దశాబ్ధకాలంలో చెత్త ప్రదర్శనను కలిగి ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. అమెరికా 28వ స్థానంలో, ఫ్రాన్స్-25వ స్థానంలో, జర్మనీ 15వ స్థానంలో ఉన్నాయి. అత్యంత అవినీతి గత దేశంగా ఆఫ్రికా కంట్రీ దక్షిణ సూడాన్ 180వ స్థానంలో ఉంది. సోమాలియా, వెనుజులా, సిరియా, యెమెన్, లిబియా వంటి దేశాలు చివరి నుంచి వరస స్థానాల్లో నిలిచాయి.
అవినీతి తక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు
ర్యాంక్ 1: డెన్మార్క్ (స్కోరు: 90)
ర్యాంక్ 2: ఫిన్లాండ్ (స్కోరు: 88)
ర్యాంక్ 3: సింగపూర్ (స్కోరు: 84)
ర్యాంక్ 4: న్యూజిలాండ్ (స్కోరు: 83)
ర్యాంక్ 5: లక్సెంబర్గ్ (స్కోరు: 81)
ర్యాంక్ 5: నార్వే (స్కోరు: 81)
ర్యాంక్ 5: స్విట్జర్లాండ్ (స్కోరు: 81)
ర్యాంక్ 8: స్వీడన్ (స్కోరు: 80)
ర్యాంక్ 9: నెదర్లాండ్స్ (స్కోరు: 78)
ర్యాంక్ 10: ఆస్ట్రేలియా (స్కోరు: 77)
అత్యధిక అవినీతి ఉన్న టాప్ 10 దేశాలు
ర్యాంక్ 170: సూడాన్ (స్కోరు: 15)
ర్యాంక్ 172: నికరాగ్వా (స్కోరు: 14)
ర్యాంక్ 173: ఈక్వటోరియల్ గినియా(స్కోరు: 13)
ర్యాంక్ 173: లిబియా (స్కోరు: 13)
ర్యాంక్ 173: యెమెన్ (స్కోరు: 13)
ర్యాంక్ 177: సిరియా (స్కోరు: 12)
ర్యాంక్ 178: వెనిజులా(స్కోరు: 10)
ర్యాంక్ 179: సోమాలియా (స్కోరు: 9)
ర్యాంక్ 180: దక్షిణ సూడాన్ (స్కోరు: 8)