Site icon NTV Telugu

ఈ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోంది : ప్రియాంకగాంధీ

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు చేశారు. నేడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహించగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్‌, వంట నూనె ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.

ప్రజల సంక్షేమాల గురించి బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయంలో నిత్యావసర ధరలు అన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవి ఆమె గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు చేసిన బీజేపీ ప్రభుత్వం 700 మంది రైతుల ప్రాణాలు పోయాక ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందన్నారు.

Exit mobile version