NTV Telugu Site icon

Brij Bhushan Singh: “గంగలో పారేస్తామని వెళ్లి టికాయక్‌కు ఇచ్చారు”.. రెజ్లర్ల నిరసనపై బ్రిజ్ శరణ్ కామెంట్స్..

Brij Sharan Singh

Brij Sharan Singh

Brij Bhushan Singh: రెజ్లర్లు గంగలో తమ మెడల్స్ పారేస్తామని చెబుతూ హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై భారత రెజర్ల సమాఖ్య(WFI) చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల్ని కొట్టిపారేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ శరణ్ ను పదవి నుంచి తీసేసి, అరెస్ట్ చేయాలని మహిళా రెజ్లర్లు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే తమ మెడల్స్ గంగా నదిలో విసిరేస్తామని మంగళవారం రెజ్లర్లు హరిద్వార్ వెళ్లారు. ఆ సమయంలో రైతు సంఘాల నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. బ్రిజ్ శరణ్ అరెస్ట్ పై ప్రభుత్వానికి 5 రోజుల అల్టిమేటం విధించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన ఆహార సంక్షోభం.. యూఎన్ నివేదిక..

దీనిపై బ్రిజ్ శరణ్ స్పందించారు. రెజ్లర్లు వారి పతకాలను గంగలో ముంచితే మనం ఏం చేయగలం..? అని అన్నారు. రెజ్లర్లు తమ మెడల్స్ ని గంగా నదిలో పారేయడానికి వెళ్లారు..కానీ గంగలో విసిరేయకుండా.. వాటిని రాకేష్ టికాయత్ కు ఇచ్చారు. అది వారి నిర్ణయం.. మనం ఏం చేయగలం..? అని అన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అని ఆయన అన్నారు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని.. వారు మాత్రమే దీనికి సమాధానం చెప్పాలని, వారి అభ్యర్థన మేరకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని అన్నారు. ‘‘తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. నా పదవి కాలం ముగిసింది, ఎన్నికలు జరుగుతాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. నేను తప్పు చేసినట్లు తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. దానితో నాకు ఎలాంటి సమస్య లేదు అని పునరుద్ఘాటించారు.

మంగళవారం రోజున హరిద్వార్ వెళ్లిన రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్ గంగా నదిలో పతకాలను పారేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమయంలో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రైతు సంఘాల నేతలు వారించడంతో వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆరు సార్లు ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.