Bihar: బీహార్ ముజఫర్‌పూర్‌లో జరిగిన వివాహ ఊరేగింపుకు హాజరైన నలభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయితే, పెళ్లికి హాజరైన వీరంతా మద్యం సేవించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వరుడి తరుపున వచ్చిన వారంతా మద్యం సేవించి, ఊరేగింపులో నాగిన్ డ్యాన్సులు చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హాజరైన వారు ఇతరులకు గిప్టు ఇవ్వడానికి మద్యం బాటిళ్లని కూడా తీసుకెళ్లారు. ఈ ఘటనలో రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌గా కాష్ పటేల్.. ప్రో-ఇండియా లీడర్లతో నింపేస్తున్న ట్రంప్..
40 మందితో పాటు ఏడుగురు మద్యం వ్యాపారులు, వివాహానికి హాజరైన వారు మద్యం కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేశారు. మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ మనుషులుగా వచ్చిన ఎక్సైజ్ పోలీసులు పెళ్లిలో మద్యంతో సంబంధం ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మద్యం స్మగ్లర్లు మరియు తాగుబోతులపై ఎక్సైజ్ శాఖ నిరంతరం ప్రచారం నిర్వహిస్తోందని, మా బృందం సభ్యులు వారిపై నిఘా ఉంచారని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శివేంద్ర ఝా తెలిపారు.
బీహార్ మధ్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన అనేక సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం బయటపడ్డాయి. మద్యపాన నిషేధం వల్ల కొన్ని సందర్భాల్లో కల్తీ మద్యానికి అలవాటు పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఉన్నాయి. గత నెలలో పాట్నా హైకోర్టులో సంపూర్ణ మద్యపాన నిషేధంపై బీహార్ ప్రభుత్వ అధికారుల్ని నిందించింది. నిషేధాన్ని పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులే కాదు, రాష్ట్ర పన్ను శాఖ, రవాణా శాఖ అధికారులే ఇష్టపడుతున్నారని, ఇది వారికి పెద్ద ఎత్తున డబ్బు తీసుకువస్తోందని, నిజానికి అనధికారిక మద్యం, ఇతర నిషేధిత వ్యాపారాలకు దారి తీసిందని జస్టిస్ పూర్ణేందు సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.