NTV Telugu Site icon

April 1: ఏప్రిల్ 1 నుంచి మారబోతున్నవి ఇవే.. టాక్స్ రేట్స్, యూపీఐ, జీఎస్‌టీ..

Upi

Upi

April 1: ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. UPI, GST, పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పౌరుల్ని ప్రభావితం చేస్తే ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. పన్ను స్లాబుల మార్పుల నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), యూనిఫైడ్ పెన్షన్ పథకం ప్రారంభం వరకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కొత్త పన్ను స్లాబులు, రేట్లు:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌లో కొత్త పన్ను స్లాబులు, రేట్లను ప్రకటించిన తర్వాత, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. వార్షికంగా 12 లక్షల వరకు సంపాదించే వారు కొత్త విధానంలో పన్నుల నుంచి మినహాయించబడతారు. అదనంగా జీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ మినహాయింపులకు అర్హులు అవుతారు. దీని అర్థం రూ.12,75,000 వరకు జీతం ఉన్న వ్యక్తి ఎలాంటి పన్నులు చెల్లించకుండా మినహాయించబడుతాడు.

వార్షికాదాయం రూ. 12 లక్షల్ని మించితే, ఆదాయ పన్ను రేట్లు ఇలా ఉండబోతున్నాయి.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS):

యూనిఫైడ్ పెన్షన్ పథకం(యూపీఎస్)ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2024లో ప్రారంభించింది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబడుతుంది. దీని వల్ల దాదాపుగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. కనీసం 25 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి వారి చివరి 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు.

యూపీఐ:

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యొక్క భద్రత, సామర్థ్యాన్ని పెంచడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. బ్యాంకులు, యూపీఐ ప్రొవైడర్లు(ఫోన్ పే, గూగుల్ పే) ఇన్ యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లను దశలవారీగా తొలగించనున్నారు.

యూపీఐతో లింక్ చేయబడిన యాక్టివ్‌గా లేని నెంబర్లు తరుచుగా భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినియోగదారులు తమ నెంబర్లను మార్చినప్పుడు, వారి యూపీఐ ఖాతాలు మాత్రం యాక్టివ్‌గా ఉంటాయి. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫారామ్స్ ఇలాంటి నెంబర్లను తొలగించేందుకు వారి డేటా బేస్‌ని క్రమం తప్పకుండా, కనీసం వారినికి ఒకసారి అప్‌డేట్ చేయాలని NPCI తెలిపింది.

యూపీఐ లైట్ వ్యాలెట్‌లో లోడ్ చేసిన అమౌంట్‌ని మళ్లీ బ్యాంక్‌ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI గతంలో సూచించింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్, పాస్ కోడ్, బయోమెట్రిక్ వంటివి వాడాల్సి ఉంటుంది.

జీఎస్‌టీ:

కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ విధానం కూడా వార్షిక మార్పులను పొందబోతోంది. జీఎస్‌టీ పోర్టల్‌లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదాడులకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్(MFA) తప్పనిసరి చేయబడుతుంది.180 రోజుల కన్నా పాతమి కాని బేస్ డాక్యుమెంట్ల కోసం మాత్రమే E-వే బిల్లులు (EWBలు) రూపొందించబడతాయి.