ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.
ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా… ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాలు
న్యూఢిల్లీ నియోజకవర్గం
ఆప్ – అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ – పర్వేష్ వర్మ
కాంగ్రెస్ – సందీప్ దీక్షిత్
కల్కాజీ నియోజకవర్గం
ఆప్ – అతిషీ
బీజేపీ – రమేష్ బిధూరీ
కాంగ్రెస్ – అల్కా లంబా
జంగ్‌పురా నియోజకవర్గం
ఆప్ – మనీష్ సిసోడియా
బీజేపీ – సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా
కాంగ్రెస్ – ఫర్హాద్ సురి
ప్రతాప్‌గంజ్ నియోజకవర్గం
ఆప్ – అవధ్ ఓజా
బీజేపీ – రవిందర్ సింగ్ నేగి
కాంగ్రెస్ – అనిల్ చౌదరీ
మాలవ్యా నగర్ నియోజకవర్గం
సోమనాథ్ భారతీ (ఆప్)
సతీష్ ఉపాధ్యాయ( బీజేపీ)
జితేందర్ కుమార్ కోచర్ (కాంగ్రెస్)
ఛత్తార్‌పూర్ నియోజకవర్గం
బ్రహ్మ సింగ్ తన్వార్ (ఆప్)
ఖర్తార్ సింగ్ తన్వార్ (బీజేపీ)
రాజేందర్ సింగ్ తన్వార్ (కాంగ్రెస్)
బల్లిమరాన్ అసెంబ్లీ నియోజకవర్గం
ఇమ్రాన్ హుస్సేన్ (ఆప్)
హరూన్ యూసఫ్ (కాంగ్రెస్)
కమల్ బగ్రీ (బీజేపీ)
ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం
అమనతుల్లా ఖాన్ (ఆప్)
బ్రహ్మం సింగ్ (బీజేపీ)
అరిబ్ ఖాన్( కాంగ్రెస్)
షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గం
సత్యందర్ జైన్ (ఆప్)
కరైన్ సింగ్(బీజేపీ)
సతీష్ లూథ్రా (కాంగ్రెస్)
రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం
ప్రదీప్ మిట్టల్ (ఆప్)
సుమేష్ గుప్తా (కాంగ్రెస్)
విజేందర్ గుప్తా (బీజేపీ)