S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు. ముంబైలో జరిగిన సంఘటన మళ్లీ జరగకూడదని ఆయన అన్నారు. ముంబై అనేది ఉగ్రవాద వ్యతిరేక చిహ్నం అని మంత్రి చెప్పారు. మహారాష్ట్రలోని పూణేలో ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ప్రెసెంట్ గ్లోబర్ సినారియో’’ అనే కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యదేశంగా ఉన్నప్పుడు, ఉగ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించిన సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఉగ్రదాడికి గురైన హోటల్‌లోనే మేము కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ సమావేశాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం బలంగా నిలుస్తుందని ప్రజలుకు తెలుసని, ఉగ్రవాదంపై పోరులో భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు.
ఉగ్రవాదంపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్‌ని అవలంభిస్తోందని, ఎవరు ఏది చేసినా తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. పగటి పూటి వ్యాపారం చేయడం, రాత్రి పూట టెర్రరిజం చేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. భారతదేశ పరిస్థితులు మారిపోయాయని, దీనిని భారత్ అంగీకరించదని చెప్పారు. చైనా, భారత సరిహద్దుల్లో ఇరు దేశాలు త్వరలోనే పెట్రోలింగ్ ప్రారంభిస్తామని, 2020 ఏప్రిల్ స్థితిని పునరుద్ధరిస్తామని చెప్పారు.