NTV Telugu Site icon

Jaishankar: నెహ్రూ భారత్‌ని కాదని చైనాకు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించారు.. పటేల్ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..

Jawaharlal Mehru

Jawaharlal Mehru

Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్‌కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూని ఎలా హెచ్చరించారనే విషయాలను పంచుకున్నారు.

Read Also: Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్‌ రోడ్ షోలో అన్నామలై..

నెహ్రూ ఇండియా కంటే ముందు చైనాకు యూఎన్ఎస్‌సీ‌లో శాశ్వత సభ్యదేశంగా స్థానం కల్పించాలని అనుకున్నారని జైశంకర్ అన్నారు. 1950లో సర్దార్ పటేల్, నెహ్రూ మధ్య సమావేశం జరిగింది. దీంట్లో పటేల్ చైనా ముప్పు గురించి నెహ్రూని హెచ్చరించారు. ఈ రోజు మనం రెండు వైపు(పాకిస్తాన్, చైనా) నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని పటేల్ చెప్పారు. చైనీయులు ఏది మాట్లాడినా, వారి ఉద్దేశం మంచిది కాదని తాను భావిస్తు్న్నానని అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని, దీనిపై ఒక విధానాన్ని రూపొందించాలని పటేల్ హెచ్చరించారు. అయితే నెహ్రూ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు’’ అని జైశంకర్ అన్నారు.

‘‘ చైనీయులను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారని నెహ్రూ, పటేల్‌తో అన్నారు. హిమాలయాల మీదుగా మనపై దాడి చేయడం అసాధ్యం. యూఎన్‌లో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చర్చ జరిగింది. అయితే, ఈ స్థానాన్ని ముందుగా చైనాకు ఇవ్వాలని అని నెహ్రూ చెప్పారు. కాబట్టి ఈ రోజు మనం మొదట భారత్ గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు చైనా గురించి మాట్లాడిన సందర్భం అది’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లవద్దని సర్దార్ పటేల్ వైఖరిని కూడా నెహ్రూ పట్టించుకోలేదని, గత దశాబ్ధ కాలంగా కేంద్రంలో బీజేపీ వారసత్వంగా వచ్చిన సమస్యలతో వ్యహరిస్తోందని ఆయన చెప్పారు.

Show comments