Site icon NTV Telugu

తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని సూచించింది.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం .. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. గత కొద్ది రోజులుగా తమిళనాడులో ఎడతేరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రాష్ట్ర రాజధాని చైన్నై అతలాకుతలమైంది. రాష్ట్రంలో వరదల కారణంగా ఐదుగురు మృతి చెందినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version