Karnataka High Court: తండ్రి ఆస్తులను పంచుకుంటారు కానీ.. అప్పులను పంచుకోరు కొడుకులు. తండ్రి చేసిన అప్పులతో తనకు ఏం సంబంధం ఉందని ఉల్టా ప్రశ్నిస్తుంటారు. నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తిని నట్టేట ముంచుతారు. అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇక అంతే సంగతులు. కొడుకులను అప్పు చెల్లించాలని కోరితే..తనకు ఆ అప్పు గురించి తెలియదని..నన్నడిగి అప్పు చేశాడా..? అంటూ ఎదురు ప్రశ్నించడం పలు సందర్భాల్లో మనం చూసే ఉంటాం. అయితే అలాంటి కొడుకులకు దిమ్మతిరిగిపోయేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Read Also: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం, మరణించిన తండ్రి బాధ్యతలను తీర్చాల్సిన బాధ్యత కొడుకుదే అని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన తండ్రి అప్పు తీసుకున్నందున తనపై చట్టబద్ధంగా చర్యలు తీసుకునే వీలు లేదని నిందితుడైన బిటీ దినేష్ చేసిన వాదనలను జస్టిస్ కే నటరాజన్ తిరస్కరించారు. తండ్రి చేసిన అప్పును కుమారుడు తీర్చాల్సిందే అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. భారమప్ప అనే వ్యక్తి తన వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం 2003లో ప్రసాద్ రాయకర్ నుంచి రూ. 2,60,000లను 2 శాతం కింద అప్పు తీసుకున్నాడు. అయితే ఈ అప్పును తీర్చుకుండా భారమప్ప మరణించారు. దీనికి సంబంధించిన ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నారు. భారమప్ప మృతితో తన అప్పును తీర్చాలని ప్రసాద్ కోరగా.. భారమప్ప కొడుకు దినేష్ 2005లో రూ.10,000 చెల్లించాడు. ఆ తరువాత పలు దఫాలుగా రూ. 2,25,000 చెక్కులను జారీ చేశాడు. అయితే అవన్నీ బౌన్స్ అయ్యాయి. దీంతో కోర్టును ఆశ్రయించాడు. ఐసిడిఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్ అండ్ అన్ఆర్ కేసులో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. కర్ణాటక హైకోర్టు తండ్రి అప్పును కొడుకు తీర్చాల్సిందే అని తీర్పు చెప్పింది.
