NTV Telugu Site icon

Neetha Ambani: హ్యాండ్‌ బ్యాగ్‌ ఖరీదు రూ. 3.20 కోట్లు.. ఎవరిదో తెలుసా?

Neetha Ambani

Neetha Ambani

Neetha Ambani: సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు ఏదీ చేసినా సంథింగ్‌ స్పెషల్‌గా చూస్తారు జనం. వారు వేసుకొనే చెప్పులు, బట్టలు, వాడే వాచీ, కళ్లద్దాల గురించి మాట్లాడుకుంటారు. ఇక వారు వాడే వాహనాలు కార్లు కావొచ్చు.. బైక్‌లు కావచ్చు.. ఇలా ఏదైనా సంధింగ్‌ స్పషల్‌గానే చెప్పుకుంటారు. అలాంటిదే ఆమె ఒక బడా వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చారు. ష్యాషనబుల్‌గా ఏది మార్కెట్‌లోకి వచ్చినా దానిని తప్పకుండా ఉపయోగిస్తారు. ఇపుడు ఆమె వాడే హ్యాండ్‌ బ్యాగ్‌తో వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఆమె వాడే హ్యాండ్‌ బ్యాగ్‌ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 3 కోట్ల 20 లక్షలు.. అదేంటీ హ్యాండ్‌ బ్యాగ్‌ అంతనా.. అన్ని కోట్లు పెట్టి హ్యాండ్‌ బ్యాగ్‌ కొని వాడుతున్నారా? అని ఆశ్యర్యపోతున్నారా? ఇది నిజం ఆమె వాడే హ్యాండ్‌ బ్యాగ్‌ ఖరీదు రూ. 3.20 కోట్లు. ఆమె ఎవరో కాదు.. రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి.. నీతా అంబానీ..

Read also: Thamanna – Vijay Varma : విజయ్ వర్మ తో తమన్నా.. ఆవుట్ సైడ్ కెమెస్ట్రీ సూపర్ గురూ.!

నీతా అంబానీ నిజంగా ఒక స్టైలిష్‌ ఐకాన్‌గా ఉంటారు. ఆమె తన ఫ్యాషన్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. తను వాడే దుస్తులైనా, పాదరక్షలైనా, బ్యాగ్‌లైనా నీతా అంబానీ స్టైల్‌ స్టేటస్‌గా నిలుస్తుంటాయి. తాజాగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో, నీతా అంబానీ అందరి దృష్టిని ఆకర్షించారు. కల్చరల్‌ సెంటర్‌లో మూడవ రోజు నీతా కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రారంభించారు. అక్కడ తను చాలా మందిని ఆకర్షించింది. నీతా అంబానీ ఈ సారి ఓపెన్ హెయిర్, మినిమల్ మేకప్‌తో కనిపించించారు. ఈసారి నీతా అంబానీ తన వెంట తెచ్చిన అత్యంత ఖరీదైన బ్యాగ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

Read also: Assam Floods: అస్సాంలో కొనసాగుతున్న వరద పరిస్థితి.. ఒక్క జిల్లాలోనే 67వేల మంది!

నీతా అంబానీ ఫౌబర్గ్ బిర్కిన్‌ 20 వైట్ మ్యాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్‌ వెంట తెచ్చుకున్నారు. ఈ బ్యాగ్ రూపకల్పన చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. దీని ప్రత్యేక నాణ్యత కారణంగా బ్యాగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ బ్యాగ్ ఖరీదు 4,00,000 అమెరికన్‌ డాలర్లు.. అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 3.2 కోట్లు అన్నమాట. హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దీనికి కారణం అధిక ధర మాత్రమే కాదు. ఈ బ్రాండ్ చాలా సెలెక్టివ్ బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. అలాగే వాటిని విక్రయించడంలో మరింత సెలెక్టివ్‌గా ఉంటారు. ఈ బ్యాగ్‌లలో ఒకటి తయారు చేయడానికి నెలలు, సంవత్సరాలు కూడా వేచి ఉండాలి. అంతటి విలువైన ఈ బ్యాగ్ నీతా అంబానీ తన వెంట తెచ్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీతా అంబానీ తన లైఫ్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. ముఖ్యంగా ఆమె చీరల విషయంలోనూ అలాగే ఫ్యాషన్ విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా ఉంటారు. అందుకే తరచూ ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. ఇటీవల వైట్ హౌస్ లో నిర్వహించిన విందు కార్యక్రమంలో ఆమె ధరించిన తెల్ల చీర కూడా ఒక సెన్సేషన్ అయిందంటే ఆశ్చర్యం కాదేమో. ఎందుకంటే ఈ చీరలు తయారు చేయడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టిందని డిజైనర్లు చెబుతున్నారు.

Show comments