NTV Telugu Site icon

Karnataka: ఉద్యోగం పేరుతో మోసాలు.. ఆంధ్రా మూలాలున్నయువకులే టార్గెట్..

Untitled 7

Untitled 7

Karnataka: ఉద్యోగం పేరుతో యువతను మోసం చేస్తున్న నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల లోకి వెళ్తే.. పవన్ కుమార్ కొల్లి, మధు, రత్నకాంత్ అనే వ్యక్తులు కలిసి సిమాఖ్ టెక్నాలజీ & మోంటే కార్ప్స్ (SIMAKH TECHNOLOGY & MONTY CORPS ) అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉధ్యోగం కోసం వెతుకుతున్న యువకులకు స్టార్టప్ కంపెనీలో ఏడాదికి ఏడాదికి రూ.5 లక్షలు జీతం ఇస్తామని నమ్మించారు. కాగా ఉద్యోగం ఇచ్చేందుకు లక్ష రూపాయలు తీసుకుని యువకులను మోసం చేయసాగారు. కాగా ఆంధ్ర మూలాలున్న విద్యావంతులైన యువకులనే లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు.

Read also:Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో ప్రతిపాదన!

ఇందుకు గాను మొదట ఉద్యోగం ఇస్తామని దాని కోసం లక్ష రూపాయలు నగదు చెల్లించాలని చెప్పి యువకుల నుండి లక్ష రూపాయలు నగదు తీసుకునే వారు.. అనంతరం ఉద్యోగం ఇచ్చినట్టు సెకండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ ఇచ్చి ఉద్యోగంలో చేరినట్లుగా వ్యవహరించేవాడు. తీరా నెల జీతం ఇచ్చే సమయానికి కంపెనీ మూసేసి పరారైయ్యేవారు. ఇలా నగరంలో పలు చోట్ల ఉద్యోగం పేరుతో యువకులను మోసం చేసారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేసథ్యంలో ఈ మోసాలకు పాలపడుతున్న ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు పవన్ కుమార్ కొల్లిని వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మధు, రత్నకాంత్ అనే మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.