PM Modi: తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దశల్లో జరిగి ఎన్నికల్లో ముగిసినా, కొందరు వ్యక్తులు ఇంకా ఓటింగ్ లెక్కల్లోనే ఇరుక్కుపోయారని అన్నారు. తాను ఈ ఎన్నికలను అర్థమేటిక్ కన్నా కూడా కెమిస్ట్రీగానే చూస్తున్నానని చెప్పారు. కెమిస్ట్రీ చాలా శక్తివంతమైందని, ఫలితాన్ని చూపుతుందని చెప్పారు. తొలి దశలోనే విపక్షాల కూటమి ఓడిపోయిందని అన్నారు. రెండో దశలో అది కూలిపోయిందని, మూడో దశలో వాళ్లు నేలకొరిగారని ప్రధాని అన్నారు. బీజేపీపై ప్రజలకు చాలా విశ్వాసం ఉందని అన్నారు.
Read Also: Pakisthan: బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని ముష్కరులు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు హతం
ఈ మూడు దశల్లో ర్యాలీలు, రోడ్ షోలు చేశానని, మీడియాతో మాట్లాడానని, 2014, 2019 ఎన్నికల్ని చూశానని, చాలా మంది ప్రజలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రజలు ఇప్పుడు ఉత్సాహంగా పాలుపంచుకున్నారని ప్రధాని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓ భక్తి భావ వాతావరణాన్ని చూస్తున్నానని, దేశమంటే భక్తి, సమాజం అంటే భక్తి కనిపిస్తోందని, సమాజ నిర్మాణం కనిపిస్తోందని, రాజకీయ చైతన్యం కిందిస్థాయి నుంచి కనిపిస్తోందని అన్నారు. 2019 రికార్డులను ఈ ఎన్నికలు తుడిచిపెడుతాయని, మా గెలుపు మార్జిన్ మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇండి కూటమి ఆపసోపాలు పడుతోందని, తక్కువ ర్యాలీలు చేసిందని అన్నారు. కేరళలో ఇండీ కూటమి పరిస్థితి విచిత్రంగా ఉందని, అక్కడ ఇండీ కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ప్త్రత్యర్థులుగా ఉన్నాయని అన్నారు. ఆఖరి వరకు సీట్లు డిసైడ్ కాలేదని,క్యాంపెయిన్ థీమ్ కూడా లేదని, మోడీడి తిట్టడం రోజూ జరిగేదే అని, ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. మొత్తంగా ఇండియా కూటమి తీరు దయనీయంగా ఉందని అన్నారు.
కూటమి తీరు చూస్తుంటే ఒకసారి ఈసీపై ఫిర్యాదు చేస్తారు. మరోసారి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తారు, మరోసారి ఓటింగ్ లెక్కలపై గొడవలు చేస్తారని, వాళ్లకి క్యాంపెయిన్‌లపై ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. దీంతో ఓడితే ఎవరిని తప్పుపట్టాలనే దానిపై దృష్టిపెడుతున్నారని అన్నారు. ఈవీఎంలను నిందించాలా..? లేక భాగస్వామ్య పక్షాలను తప్పుపట్టాలా అని ఆలోచిస్తున్నారని మోడీ అన్నారు.