Site icon NTV Telugu

Chilling Incident: పెళ్ళి చేసుకోమని అడిగితే.. ముక్కలు ముక్కలు చేసి హత్య

Delhi Incident

Delhi Incident

Man killed his girlfriend.. Body Chopped Into 35 Pieces: అత్యంత పాశవికంగా గర్ల్ ఫ్రెండ్‌ని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. తననే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ముంబైలో ఉన్న సమయంలో వీరిద్దరు లవ్ లో పడ్డారు. అయితే వీరిద్దరి వివాహాన్ని అమ్మాయి తరుపు బంధువులు ఒప్పుకోలేదు. కుటుంబాలను ఎదురించి ఢిల్లీ మెహ్రౌలీకి వచ్చిన అఫ్తాబ్, శ్రద్ధాలు కలిసి ఉంటున్నారు.

ఈ క్రమంలో శ్రద్ధా, అఫ్తాబ్ ను పెళ్లి చేసుకోవాలని బలవంత చేయడంతో ఆమెను చంపేశాడు. మే 18న అఫ్తాబ్, శ్రద్ధా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి వాటి కోసం ఓ కొత్త ఫ్రిడ్జ్ కొని అందులో భద్రపరిచాడు. ప్రతీ రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఇంటి నుంచి ఈ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేసి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేవాడు. 18 రోజుల పాటు ఇలా శద్ధా శరీర భాగాలను ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో విసిరేశారు.

Read Also: Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?

26 ఏళ్ల శ్రద్ధ ముంబైలో ఓ కాల్ సెంటర్ లో పనిచేసేది. అదే సమయంలో అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం అయి ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. కుటుంబం అంగీకరించకపోవడంతో ఇద్దరూ ముంబై నుంచి ఢిల్లీ పారిపోయారు. అయితే ఇలా వెళ్లిన కొన్ని రోజుల తర్వాత శ్రద్ధా కుటుంబ సభ్యుల ఫోన్లకు స్పందించడం మానేసింది. దీంతో తండ్రి వికాస్ మదన్ తన కుమార్తె శ్రద్ధను చూసేందుకు ఢిల్లీ వచ్చారు. ఆ సమయంలో ఫ్లాట్ కు తాళం వేసి ఉంది. దీంతో ఆయన మెహ్రౌలి పోలీసులను ఆశ్రయించారు.

కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న మెహ్రౌలి పోలీసులు కేసును దర్యాప్తు చేయగా.. విస్తూ పోయే నిజాలు బయటపడ్డాయి. ఆరు నెలల తర్వాత శనివారం అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రద్ధ తనను వివాహం చేసుకోవాలని కోరడంతో గొడవలు జరిగేవని.. అందుకే చంపేసినట్లు వెల్లడించాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు శ్రద్ధ మృతదేహం కోసం గాాలిస్తున్నారు.

Exit mobile version