దశాబ్దాలుగా ఉన్న ఎన్నికల సవరణ చట్టాల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఓటర్ కార్డుతో-ఆధార్ అనుసంధాన బిల్లును లోక్ సభలోసోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మొదటినుంచి విపక్షాలు అడ్డుకోవాలని చూసినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యంగా బోగస్ ఓట్లను గుర్తించడానికి వాటికి చెక్ పెట్టేందుకు దీనిని తీసుకొస్తున్నామని ప్రకటించినా విపక్ష సభ్యులు తమ ఆందోళనలను మాత్రం విరమించలేదు.
దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేయగా, పార్లమెంట్‌లో ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరగలేదని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ చట్టం ద్వారా ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించనున్నారు. మరోవైపు ఈ చట్టంతో బోగస్ ఓట్లు తొలగించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ఈ బిల్లు ప్రకారం ఓటర్లుగా రిజిస్ట్రర్ అవ్వడానికి గుర్తింపు కార్డుకు పౌరులు తమ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బిల్లులోని సానుకూల అంశాలను సభలో వివరించే ప్రయత్నం చేసినా విపక్ష సభ్యులు తమ మొండి వైఖరి వీడలేదు. దీంతో బిల్లు పాస్ అయిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.
