ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మహా శివరాత్రి పండుగతో ముగుస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా దాదాపు 45 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 63.36 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా కుంభమేళా నిలిచింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర కోట్లాది మంది భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇది కూడా చదవండి: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం!
ఇదిలా ఉంటే ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం ప్రగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక గుడారాలు, టాయిలెట్లు ఏర్పాటు చేసింది. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసింది. ఇక తప్పిపోయిన వారి సమాచారం తెలియజేసేందుకు 24 గంటలు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వైద్య సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Shivaratri New Song 2025: దుమ్ములేపుతోన్న ‘దేవ దేవ శంకర దేవ శంభో శంకరా..’ సాంగ్..
ఇక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళా జరుగుతుంది. అయితే ఈసారి ఊహించని రీతిలో భక్తులు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్, ఆహార కొరత ఏర్పడింది. ఇక జనవరి 26న మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఇక న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కూడా మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు.
ఇది కూడా చదవండి: India Masters: మెరిసిన సచిన్, యువరాజ్.. ఇంగ్లాండ్‌పై భారత్ విజయం!