ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా మహా శివరాత్రి పండుగతో ముగుస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా దాదాపు 45 రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 63.36 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.