NTV Telugu Site icon

Karnataka BJP: రాహుల్ గాంధీ ఇంతకూ ‘ముస్లిం లేదా క్రిస్టియన్’: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

Karnataka

Karnataka

Karnataka BJP: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ఇంతకూ ముస్లింనా లేదా క్రైస్తవుడా అని ప్రశ్నిస్తూ ఆయన కులం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తడంతో తాజాగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుడు తన నిజమైన కులాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు చేయాలని కాషాయ పార్టీ శాసన సభ్యుడు కోరారు. ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నాడు.. కుల సర్వే చేయమంటున్నాడు.. కానీ ఆయన ఏ కులంలో పుట్టాడో కూడా తెలియదు అంటూ విమర్శించారు.

Read Also: ChandraHass : ఆటిట్యూడ్ స్టార్ ‘రామ్ నగర్ బన్నీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

అయితే, రాహుల్ గాంధీ ఇంతకూ ముస్లింలకు పుట్టాడో, క్రైస్తవులకు పుట్టాడో తెలియడం లేదని అని ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ అన్నారు. ఒకవేళ తాను బ్రాహ్మణుడినని రాహుల్ చెప్పుకుంటే.. ఏ బ్రాహ్మణ వర్గానికి చెందినవాడు అయితే..? ఇంతకీ అతనికి జనివారం (జంధ్యం) ధరించిన బ్రాహ్మణుడా? మరెలాంటి బ్రాహ్మణుడు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక కంట్రీ పిస్టల్ లాంటివాడు.. అతని వల్ల ఏమీ అభివృద్ధి చెందదు అని అన్నారు. ఇక, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని హామీ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పార్టీ అధికారంలోకి వస్తే కులాలు, ఉపకులాలు, వారి సామాజిక- ఆర్థిక పరిస్థితులను లెక్కించడానికి దేశవ్యాప్తంగా సామాజిక- ఆర్థిక కుల గణనను నిర్వహిస్తామని కూడా తెలిపింది.

Show comments