Delhi: నేడు జగన్నాధ రధయాత్ర. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి. రథయాత్ర మొదలయ్యే సమయానికి భక్తుల రద్దీ మరింత పెరుగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలాలు లభిస్తాయని ప్రజల విశ్వాసం. పూరీ, అహ్మదాబాద్‌లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది. ఒడిశాలోని పూరీలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్రయాత్రను నిర్వహించనున్నారు.
Read also:Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!
ఒడిశాలోని పూరీ జగన్నాధుని రధయాత్ర అసంఖ్యాక భక్తులను అలరించనుంది. ఉదయం 9 గంటల లోపు జగన్నాధ, బలబద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్టించి తరువాత మంగళహారతి చేపడతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పూరీ రాజు గజపలి దివ్వసింగ్‌దేవ్ రథాలపై చెరాపహర(బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ సారి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Read also:PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం ట్రస్ట్ గత 130 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. రథయాత్రను రథోత్సవం అని కూడా పిలుస్తారు. పెద్ద ఊరేగింపులో భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు మరియు దేవి సుభద్ర యొక్క అద్భుతమైన రథాలను వేలాది మంది భక్తులు లాగుతారు. ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి దర్శనం కోసం తెరుచుకుంటాయి మరియు మధ్యాహ్నం 1 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు ఆలయం నుండి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, జనరల్ బజార్ మీదుగా, సాయంత్రం 6.30 నుండి 10.30 గంటల వరకు MG రోడ్ గుండా వెళుతుంది. ఆ తర్వాత అది హిల్ స్ట్రీట్, రాణిగంజ్ గుండా వెళుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.