Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్”లో బహవల్పూర్, మురిడ్కే దాడులే హైలెట్..
- ఆపరేషన్ సిందూర్‌లో ఈ రెండు దాడులే హైలెట్..
- బహవల్పూర్, మురిడ్కేలో ఉగ్రవాద సంస్థలకు చావు దెబ్బ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే, భారత్ త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పాయి. ఏకంగా పీఓకేని దాటి పాక్ లోపలకు వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిగాయి. మొత్తం 09 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. 80 వరకు ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మొత్తం దాడుల్లో బహవల్పూర్, మురిడ్కే పై జరిగిన దాడులే హైలెట్‌గా నిలిచాయి. ఈ రెండు కూడా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్నాయి. పీఓకే ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ భారత్ సైన్యం దాడులు నిర్వహించింది.
బహవల్పూర్:
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
నిజానికి బహవల్పూర్ పాక్ పంజాబ్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది మన రాజస్థాన్ రాష్ట్రానికి అవతల వైపు ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్‌పై ఆపరేషన్ సింధూర్ దాడులు జరిగాయి. బహవల్పూర్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు హెడ్ క్వార్టర్, దీని చీఫ్ మౌలానా మసూద్ అజార్ స్థావరం. ప్రాంతం ఉగ్రవాదుల కర్మాగారం ఉంది. ఇప్పుడు దీనినే భారత్ టార్గె్ట్ చేసింది. ఈ దాడిలో జైషే ట్రైనింగ్ క్యాంప్, మసీదు వంటివి ధ్వంసమయ్యాయి. మసూద్ అజార్‌కి కుటుంబంలోని అక్క, బావ, మేనల్లుడు, భార్య, మేనకోడలు, వారి ఐదుగురు పిల్లలు మొత్తం 10 మంది హతమయ్యారు. అయితే, 2019 పుల్వామా దాడి సమయంలోనే బహవల్పూర్‌పై ఎయిర్ స్ట్రైక్స్ జరగాల్సి ఉండేది. కానీ, ఆ సమయంలో బాలాకోట్‌ని ఎంచుకుని దాడి చేశారు. ఈ సారి మాత్రం అందుకు మినహాయింపులు ఇవ్వలేదు. టార్గెట్ చేసి జైషే కంచుకోటను బద్ధలు కొట్టారు.
మురిడ్కే:
బహవల్పూర్‌తో పాటు మురిడ్కేపై దాడి భారత సత్తాను చాటింది. ఇది కూడా పంజాబ్ ప్రావిన్సులో ఉత్తర భాగంలో ఉంది. లాహోర్ నగరానికి కొన్ని కి.మీ దూరంలోనే మురిడ్కే ఉగ్ర స్థావరం నెలకొని ఉంది. దీనిపై కూడా భారత్ విరుచుకపడింది. సరిహద్దు నుంచి 25 కి.మీ ఉన్న మురిడ్కేలోని మర్కజ్ తైబా శిబిరం లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది. ముంబై ఉగ్రవాదుల్లో పట్టుబడిన అజ్మల్ కసబ్ ఇక్కడే శిక్షణ పొందాడు. డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యాడని సమాచారం.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!