Site icon NTV Telugu

Kedarnath: కేదార్‌నాథ్‌లో ఎయిర్ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Helicopter

Helicopter

కేదార్‌నాథ్‌లో ఎయిర్‌ అంబులెన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో అమాంతంగా కింద పడింది. పైకి లేచేందుకు ప్రయత్నించినా తిరిగి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్నవారు మొబైల్‌లో రికార్డ్ చేశారు. అయితే ఛాపర్‌లో ఉన్నవారంతా సేఫ్‌గా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Minister Ponnam: త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ..

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎయిర్‌ అంబులెన్స్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. హెలికాప్టర్ టెయిల్ రోటర్ పని చేయడం లేదు. దీంతో పైలట్ దానిని చాలా కష్టంగా ల్యాండ్ చేశాడు. పైలట్ చాకచక్యంతో ముగ్గురు ప్రాణాలు దక్కాయి. హెలిప్యాడ్ దగ్గర నిలబడి ఉన్న ప్రజలు సహాయం కోసం హెలికాప్టర్ వైపు పరుగెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఇది కూడా చదవండి: Jyoti Malhotra: ఇంత మంది ఫాలోవర్లు ఉన్న ఇదేం బుద్ధి.. పాక్ కోసం జ్యోతి మల్హోత్రా గూఢచర్యం..

సంజీవని హెలికాప్టర్ అంబులెన్స్‌ను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నడుపుతోంది. హెలికాప్టర్‌లో ఇద్దరు వైద్యులు, ఒక పైలట్ ఉన్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న యాత్రికుడిని రక్షించడానికి ఎయిర్ అంబులెన్స్ కేదార్‌నాథ్‌కు వచ్చింది. అయితే టెయిల్ రోటర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్ అయిందని హెలికాప్టర్ సర్వీస్‌కు నోడల్ అధికారి చౌబే తెలిపారు. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు నిర్వహిస్తుందని చౌబే తెలిపారు. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు వైద్యులు, ఒక పైలట్ సురక్షితంగా ఉన్నారని జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి రాహుల్ చౌబే తెలిపారు.

Exit mobile version