Site icon NTV Telugu

Bihar Elections: గురువారమే తొలి విడత పోలింగ్.. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం

Bihar

Bihar

బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక విపక్ష పార్టీల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, తేజస్వి యాదవ్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంకోవైపు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. మరోవైపు రెండు కూటమిలకు చెందిన మేనిఫెస్టోలను విడుదల చేశారు. ఇండియా కూటమి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించగా.. ఎన్డీఏ కూటమి కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఇలా ఎవరికి వారే జోరుగా హామీలు కుమ్మరించారు.

ఇది కూడా చదవండి: Kash Patel: ఆమె దేశభక్తురాలు.. జెట్‌లో వెళ్తే తప్పేంటి? సమర్థించుకున్న ఎఫ్‌బీఐ చీఫ్

బీహార్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 6 (గురువారం), రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ పేరును ప్రతిపక్ష కూటమి ప్రకటించగా… ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి పేరు మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల మోడీ మాట్లాడుతూ.. నితీష్ నాయకత్వంలో మరోసారి విజయం సాధిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. ఏడుగురు మృతి

Exit mobile version