NTV Telugu Site icon

Parliament Sessions: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధం.. అస్ర్తశస్ర్తాలతో రెడీ అవుతున్న అధికార, ప్రతిపక్షాలు

Parlament

Parlament

Parlament Meetings: వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో వాడీ వేడి చర్చలకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత 9 ఏళ్లల్లో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి అధికార బీజేపీ సిద్ధమవుతుండగా.. అదే 9 ఏళ్ల అధికారంలో బీజేపీ చేసిన లోపాలను.. వారు చేస్తామని చేయకుండా ఉన్న పనులను చెప్పి అధికార బీజేపీని బ్లేమ్‌ చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యూనివర్సస్‌ సివిల్‌ కోడ్‌(యుసీసీ) వంటి పలు కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో అధికార బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్షా కాల పార్లమెంటు సమావేశాల్లో వ్యవహారించాల్సిన వ్యూహాంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రధానమైన మంత్రులతో చర్చించారు. అలాగే పార్లమెంటులో ప్రపవేశ పెట్టబోయే బిల్లులపై ఈ నెల 3న జరిగే కేంద్ర కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన తరువాత 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లులను ప్రవేశ పెట్టే అవాకశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read also: Lokamanya Tilak Express: మహబూబాబాద్‌లో నిలిచిన లోకమాన్య తిలక్స్ ఎక్స్ ప్రెస్‌ ట్రెయిన్‌.. ఇదే కారణం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారయింది. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారు అయ్యాయి. జులై 20 నుంచి ఆగస్టు 11వరకు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
కొత్త పార్లమెంట్ నిర్మించి ప్రారంభించిన తరువాత జరుగుతున్న తొలి సమావేశాలు. సమావేశాలను జూలై 20 నుంచి ప్రారంభించనున్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించనున్నట్టు ..పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, 2023 జూలై 20 నుండి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. వర్షాకాల సమావేశాలలో సభ వ్యవహారాలు మరియు ఇతర అంశాలపై అర్థవంతమైన చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను జోషి ట్విట్టర్‌ వేదికగా కోరారు.