NTV Telugu Site icon

Cooking Oil: భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు.. దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్..!

Oil

Oil

Cooking Oil: మధ్య తరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి. పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ సహా వివిధ రకాల వంట నూనెలపై ఈ భారం పడబోతుంది. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు సుంకం లేదు.. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించడంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లు పడబోతుంది.

Read Also: Himachal Pradesh: నేడు హిమాచల్ ప్రదేశ్ బంద్కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు

కాగా, చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ వంట నూనెలపై గతంలో 12.5 శాతం దిగుమతి పన్ను విధించేది. కానీ, ఇప్పుడు దీనిని 20 శాతం పెంచి 32.5 శాతం పెంచేసింది. ముడి నూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెరిగిపోయింది. ఈ నెల 14 (నేటి) నుంచే ఇది అమల్లోకి రాబోతుంది. అదే టైంలో ఉల్లిపాయలపై ఎగుమతి సుంకం సగానికి పైగా తగ్గింది. ప్రస్తుతం 40 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా దానిని 20 శాతానికి కేంద్ర సర్కార్ తగ్గించింది.