కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలను చేపట్టేందుకు భారతీయ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని ఆ సంఘం జాతీ ఉపాధ్యాక్షుడు మల్లేష్ అన్నారు. ఈ మేరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాచిగూడలోని జాగృతి భవన్‌లో సంఘ్ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందన్నారు.
Read Also:నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు
ఎల్‌ఐసీలోని లక్ష కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంవల్ల ఎల్‌ఐసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బ్యాంకింగ్, రక్షణ, ఇన్సూరెన్స్ రంగంలో ప్రేవేటికరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మికులను ఐక్యం చేస్తున్నామని మల్లేష్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో లక్ష మంది ఉద్యోగ కార్మికులతో దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చామని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని, ప్రేవేటికరణను ఉపసంహరించుకోవాలని మల్లేష్ పిలుపునిచ్చారు.
