నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు

టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్‌చార్జ్‌లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు. పని చేయని ఇన్‌చార్జ్‌లు పక్కకు తప్పుకుంటే పార్టీ ఏం బాధపడదన్నారు. పని చేయలేని వారు తప్పుకుంటే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుంది. పనిచేయకుండా పదవులు వచ్చేయాలని ..పార్టీ అధికారంలోకి వచ్చేయాలని కోరుకుంటే అయ్యేపనికాదని చంద్రబాబు అన్నారు.

Read Also:నేను దళిత వ్యతిరేకిని కాదు: గోనెప్రకాశ్‌రావు

కుప్పం నియోజకవర్గం పార్టీకి తిరుగులేని నియోజకవర్గం. అక్కడి ఓటర్లకు నేనంటే అభిమానం. అలాంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఇబ్బంది పెట్టారు. కుప్పంలో నన్నే ఇబ్బంది పెట్టారంటే.. మిగిలిన సెగ్మెంట్లల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. పార్టీలో ఉంటూ నష్టం చేసే వ్యక్తులను ఊపేక్షించను. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. రౌడీయిజాన్ని, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడాలి. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలని చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు దిశా నిర్దేశం చేశారు.

Related Articles

Latest Articles