Site icon NTV Telugu

Thane Woman: ప్రేమికుడి కోసం పాక్ వెళ్లింది.. చివరికిలా దొరికిపోయింది!

Thanewomanpak

Thanewomanpak

మహారాష్ట్రలోని థానేకు చెందిన మహిళ.. పాకిస్థాన్‌కు చెందిన యువకుడితో ఆన్‌లైన్ ప్రేమలో పడింది. 2024, ఫిబ్రవరిలో ఇద్దరూ ఆన్‌లైన్‌లోనే వావాహం చేసుకున్నారు. దీంతో ఆమె.. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పాకిస్థాన్ వెళ్లిపోయింది. హఠాత్తుగా జూలై 17న నగ్మా అలియాస్ సనమ్ ఖాన్ రూఖ్ థానేలో ప్రత్యక్షమైంది. ఆమె పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగుతున్నారు. అసలు ఆమె ఎలా ప్రేమలో పడింది. పాకిస్థాన్ ఎలా వెళ్లింది. ఈ వివరాలను సేకరించిన పోలీసులు షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..

2021లో థానేకు చెందిన నగ్మా.. ఫేస్‌బుక్ ద్వారా పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌కు చెందిన బాబర్ బషీర్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగుతోంది. ఇలా వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే నగ్మా పాకిస్థాన్‌ వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ పాస్‌పోర్టు తిరస్కరణకు గురైంది.

అనంతరం ఫిబ్రవరి 2024లో నగ్మా.. బాబర్‌ను ఆన్‌లైన్‌లో వివాహం చేసుకుంది. పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఈసారి పత్రాల్లో పేరు మార్చేసింది. నగ్మా నూర్ మక్సూద్ అలీ సనమ్ ఖాన్ రూఖ్‌గా పేరు మార్చుకుంది. ఇలా ఆధార్ సహా పలు పత్రాల్లో పేరు మార్చుకుని పాస్ పోర్టు సంపాదించి పాక్ వెళ్లిపోయిది. తిరిగి ఈనెల 17న థానేకు చేరుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వీసా సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Indra Re Release: మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!

అయితే పోలీసుల ఆరోపణలను నగ్మా తల్లి తోసిపుచ్చింది. 2015లో తన భర్త నుంచి విడిపోయాక నగ్మా పేరు మార్చుకుందని తెలిపింది. అలాగే తన పిల్లల పేర్లు కూడా మార్చుకుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ జరగలేదు. కేవలం విచారణ కొనసాగుతోంది.

 

Exit mobile version