Indra Re Release: మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!
- మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇంద్ర
- ఇంద్ర రిలీజ్ అయి నేటికి 22 ఏళ్ళు పూర్తి
- మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాని రీ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indra Re Release : ఇంద్ర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పుట్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా రాబోతోంది. అలాగే ఇంద్ర రిలీజ్ అయి నేటికి 22 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వాస్తవానికి ఇప్పుడు రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కలెక్షన్స్ రావట్లేదు కానీ ప్రేక్షకులు మాత్రం తమ చిన్నప్పుడు థియేటర్లలో చూసిన సినిమాలను మళ్లీ ఇప్పుడు థియేటర్లలో చూసి మురిసిపోతున్నారు. ఇక ఇంద్ర సినిమా రిలీజ్ అయి దాదాపు 22 ఏళ్లు పూర్తయింది.
ట్రోల్ వీడియోలు.. ‘మా’ మరో వార్నింగ్.. ఈసారి 18 యూట్యూబ్ ఛానల్స్ ఊస్టింగ్!
Also Read
జూలై 24 వ తేదీన అంటే ఈరోజుకి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తయ్యాయి. మెగాస్టార్ కెరియర్ లో అప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలవడమే కాదు హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా కూడా నిలిచింది. అంతే కాదు ఈ సినిమా మూడు నంది అవార్డులతో పాటు రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఒక రాయలసీమ వ్యక్తి అక్కడి ప్రజల కోసం వేల కోట్ల ఆస్తులు వదులుకొని అయిన వారందరిని దూరం చేసుకుని కాశీలో సాధువులా జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటిలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులు, ప్రజలు వింటూనే ఉంటారు. అలాంటి సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్‌ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!