Site icon NTV Telugu

Terrorists: సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు.. భయపడుతున్న కాశ్మీరీలు..

Army

Army

Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

Read Also: Pakistan: లష్కరే ఉగ్రవాది, హఫీస్ సయీద్ సన్నిహితుడికి తీవ్రగాయాలు.. గుర్తు తెలియని వ్యక్తుల పనేనా..?

అయితే, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు కూడా భారత సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు విచారణ చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది తేల్చింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో టెర్రరిస్టులు సైనికుల దుస్తుల్లో కనిపించినట్లు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనుమానస్పందగా కనిపిస్తే.. తమకు సమాచారం అందించాలని ఇండియన్ ఆర్మీ పేర్కొనింది.

Read Also: Rahul Gandhi: పాకిస్తాన్‌లో “రాహుల్ గాంధీ” ట్రెండింగ్.. కారణాలు ఏంటి..?

మరోవైపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌ కోరారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ విజయవంతంగా చేపట్టిన ‘‘ఆపరేషన్‌ సింధూర్‌’’తో పాక్ కు తగిన బుద్ధి చెప్పాం అన్నారు. అమెరికా తరహాలోనే పాకిస్తాన్‌ కూడా టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలన్నారు. భారత్‌ పాక్‌కు నీటిని అందిస్తే.. వారు మా దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version