NTV Telugu Site icon

జమ్మూకాశ్మీర్‌ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : నలుగురు మృతి

జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు మొదట గ్రానైట్ లు విసిరి ఆపై కాల్పులు జరిపారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పారిపోయిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా జూన్ 6న పుల్వామా జిల్లా ట్రాలీలో బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Show comments