Site icon NTV Telugu

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. తిప్పికొట్టిన ఆర్మీ..

శ్రీనగర్‌లోని బెమీనాలో గల స్కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అనంతరం ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కాల్పులను తిప్పికొట్టాయి.

దీంతో ఉగ్రవాదులు ఆసుపత్రిలోని సిబ్బందిని, పౌరులను అడ్డుపెట్టుకొని తప్పించుకున్నట్లు శ్రీనగర్‌ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శ్రీనగర్‌ పోలీసులు, భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version