Site icon NTV Telugu

Netanyahu- Modi: ఇజ్రాయెల్‌ ప్రధానికి మోడీ ఫోన్ కాల్.. తాజా పరిణామాలపై చర్చ

Modi

Modi

Netanyahu- Modi: గత కొంత కాలంగా లెబనాన్‌పై వరుస దాడులు చేపట్టి.. హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా సహా కీలక కమాండర్లను ఇజ్రాయెల్‌ హతమార్చింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్‌ లో సంభాషించారు. పశ్చిమాసియాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు.

Read Also: Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..

కాగా, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఇటివల పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడా.. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు బందీలందరిని సురక్షితంగా రిలీజ్ చేయడం చాలా ముఖ్యం అని నెతన్యాహుకు సూచించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు సపోర్ట్ ఇచ్చే విషయానికి భారత్‌ కట్టుబడి ఉంది అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Exit mobile version