NTV Telugu Site icon

Australia: భారత నర్సింగ్ విద్యార్థిని సజీవ సమాధి.. ప్రేమను తిరస్కరించిందని ప్రియుడి ఘాతుకం..

Australia

Australia

Australia: ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్‌జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్‌జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది. అడిలైడ్ నగరంలో నివాసం ఉంటున్న జాస్మీన్ కౌర్ ని తానే హత్య చేసినట్లు బుధవారం కోర్టు విచారణలో తారిక్‌జోత్ సింగ్ అంగీకరించాడు.

21 ఏళ్ల కౌర్‌ని మార్చి 5, 2021న తారిక్‌జోత్ సింగ్ ఆమె ఆఫీస్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితుడి కారుని తీసుకుని, కారు డిక్కీలో జాస్మీన్ కౌర్ ని బంధించాడు. దాదాపుగా 650 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్లిండర్స్ రేంజ్ కి తీసుకెళ్లాడు. అక్కడ యువతి గొంతు కోసి, ఆ తరువాత తాడుతో కట్టేసి సజీవంగా సమాధి చేశాడు. ఈ ఘటనను విచారించిని సుప్రీంకోర్టు ఈ హత్యను అత్యంత దారుణమైనదిగా పేర్కొంది. బాధితురాలు దారుణమైన బాధను అనువించిందని ప్రాసిక్యూటర్ కార్మెన్ మాటియో చెప్పారు. ఆమె ప్రాణాలతో ఉన్న సమయంలో పూడ్చివేయడం వల్ల మట్టిని పీల్చడం, మింగడం జరిగిందని తీవ్రమైన బాధను అనుభవించాల్సి వచ్చిందని మాటియో పేర్కొన్నాడు. ఇది ప్రతీకార హత్యగా చెప్పారు.

Read Also: Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ

తారిక్‌జోత్ సింగ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక నెలకు జాస్మీన్ కౌర్ దారుణ హత్యకు గురైందని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. తన కుమార్తె, నిందితుడిని వందల సార్లు తిరస్కరించిందని బాధితురాలి తల్లి చెప్పింది. తారిక్ జోత్ సింగ్, జాస్మీన్ కౌర్ తో రిలేషన్ దెబ్బతినడంతో ప్రతీకారంతో హత్యకు ప్లాన్ చేశాడు. అయితే ముందుగా జాస్మీన్ కౌర్ ఆత్మహత్య చేసుకుందని.. ఆ తరువాత ఆమెను పూడ్చివేశానని ముందుగా తారిక్ జోత్ సింగ్ చెప్పాడు. అయితే విచారణ ఈ ఏడాది ప్రారంభంలో విచారణకు రాకముందే అతను హత్యానేరాన్ని అంగీకరించాడు.

సంఘటన స్థలానికి పోలీసులు తీసుకెళ్లిన సమయంలో జాస్మీన్ కి సంబంధించిన బూట్లు, గాజులు, బ్యాడ్జ్, ఆమెను కట్టేసిన తాళ్లను కనుగొన్నారు. కిడ్నాప్ జరిగిన రోజు తారిక్ హార్డ్ వేర్ షాపులో చేతి గొడుగు, కేబుల్స్, పార షాపింగ్ చేస్తున్నట్లు కెమెరాల్లో రికార్డైంది. కాగా తారిక్ జోత్ సింగ్ కు జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది.