Site icon NTV Telugu

PM Modi: విదేశీ పర్యటన నేపథ్యంలో మోడీకి ఉగ్ర బెదిరింపులు

Modi

Modi

ప్రధాని మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు. బెదిరింపు కాల్ వెనుక ఉన్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మానసిక రోగి అని తేలిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ముంబై పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందని.. విదేశీ పర్యటనలో ఉన్న మోడీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చు అని బెదిరించినట్లుగా తెలిపారు. సమాచారం అందగానే దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశామని.. కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టగా మానసిక రోగిగా తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం.. మద్దతుపై చర్చిస్తున్నాం!

ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం సోమవారం ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫిబ్రవరి 11న పారిస్‌లో ఏఐ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇక బుధవారం ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లనున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీకానున్నారు. అలాగే ఎలోన్ మస్క్‌తో కూడా సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మోడీ తొలి పర్యటన ఇదే. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: UK : యూకేలో ట్రాక్టర్లు, ట్యాంకర్లతో వీధుల్లోకి లక్షలాది మంది రైతులు

Exit mobile version