NTV Telugu Site icon

JP Nadda: ఏయ్ బిడ్డా… 2024 వరకూ నడ్డాదే బీజేపీ అడ్డా

Jp Nadda

Jp Nadda

Tenure of JP Nadda as BJP national president extended till June 2024: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా(జేపీనడ్డా) పదవీ కాలాన్ని పొడగిస్తూ బీజేపీ జాతీయకార్యవర్గ సమాావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. జూన్,2024 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొగడిస్తున్నట్లు కేంద్రహోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2024 లోక్ సభ ఎన్నికలు జేపీ నడ్డా అధ్యక్షతనే జరుగుతాయని అమిత్ షా స్పష్టం చేశారు.

Read Also: Rachakonda CP: రేపటి మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. ఎవరైనా గ్రౌండ్‌లోకి వెళ్తే కఠిన చర్యలు

నడ్డా నేతృత్వంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ బలపడిందని అమిత్ షా అన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీనే అని ఆయన అన్నారు. బీహార్, మహారాష్ట్రలో బీజేపీ బలపడిందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాము బలపడ్డామని, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల్లో గెలుపొందామని, గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చామని, గుజరాత్ లో రికార్డ్ స్థాయిలో విజయం సాధించామని అమిత్ షా అన్నారు. ఈ ఏడాది వరసగా 9 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నడ్డా వైపే పార్టీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలాన్ని పొడగించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పదవీ కాలాన్ని పొడగించే ఛాన్స్ ఉంది. వచ్చే నెల 10తో బండి సంజయ్ పదవీకాలం ముగియనుంది.

 

Show comments