Site icon NTV Telugu

Gujarat: అహ్మదాబాద్‌లో దారుణం.. టెన్త్ విద్యార్థిని చంపిన జూనియర్

Gujaratschool

Gujaratschool

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థి-తొమ్మిదో తరగతి విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్కూల్ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తాపై దాడికి సుప్రీంకోర్టు తీర్పే కారణమా?

అహ్మదాబాద్‌లోని ఖోఖారాలోని సెవెంత్ డే స్కూల్. అదే స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి- 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా స్కూల్ వెలుపల టెన్త్ విద్యార్థిని కత్తితో పొడిచాడు. దీంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ

ఈ హత్య తర్వాత సింధీ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున పాఠశాలకు వచ్చి విధ్వంసం సృష్టించారు. పాఠశాల ఆవరణలో నిలబడి ఆందోళన చేపట్టారు. అనంతరం పార్క్ చేసిన పాఠశాల బస్సులు, కార్లు, బైక్‌లు ధ్వంసం చేశారు. అంతేకాకుండా పాఠశాల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే స్కూల్ సిబ్బందిని, ప్రిన్సిపాల్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుడు సింధీ వర్గానికిి చెందిన వాడు కాగా.. నిందితుడు ముస్లిం వర్గానికి చెందిన వాడు కావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రస్తుతం హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

 

Exit mobile version