Site icon NTV Telugu

కర్ణాటకలో ఉద్రిక్తత.. శివాజీ, సంగూలి రాయన్న విగ్రహాల ధ్వంసం

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులోని సదాశివ నగర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని అవమానించారనే ఆరోపణలతో సంఘ్ పరివార్‌ మూకలు రెచ్చిపోయారు. బెలగావిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సంగూలి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బస్సులపైకి, కార్లపైకి రాళ్ళు విసిరుతూ భయాందోళనలు సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో బంద్‌ కూడా నిర్వహించారు. సంఘ్‌ పరివార్‌ మూకల అరాచకాలను నిరసిస్తూ మైసూరులో యువ జనతా దళ్‌ (ఎస్‌) కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా బెలగావి ఘటనలకు సంబంధించి పోలీసులు 27 మందిని అరెస్టు చేశారు.

Read Also: 16 జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి

నిషేధాజ్ఞలు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కల్గించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులను ఆదేశించారు. కాగా రాష్ర్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారికి తగిన శిక్షపడేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ర్టంలో అశాంతి నెలకొనేలా చూస్తున్నాయన్నారు.

Exit mobile version