Site icon NTV Telugu

Mobile Connections: 2.17 కోట్ల సిమ్‌కార్డులను రద్దు దిశగా కేంద్ర సర్కార్ యోచన..!

Sims

Sims

SIM Cards: భారత్ లో సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ మరిన్ని చర్యలకు రెడీ అయింది. నకిలీ పత్రాలు సమర్పించి తీసుకుని.. సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్న సిమ్‌ కార్డుల రద్దు దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలు అమల్లోకి వస్తే దాదాపు 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు అయ్యో అవకాశం ఉంది. అలాగే, 2.26 లక్షల మొబైల్‌ ఫోన్లను కూడా బ్లాక్‌ చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతుంది.

Read Also: Mandipalli Ramprasad Reddy: రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్‌కు మంత్రి వార్నింగ్..

కాగా, ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన భేటీలో ఈ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ సమర్పించింది. ఆ సమావేశంలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, ఆర్‌బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఐటీ శాఖ, సీబీఐకు చెందిన అధికారులు, ఇతర భద్రతా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు సైతం పాల్గొన్నారు. సిమ్‌ కార్డులు జారీ చేసేప్పుడు కేవైసీని సమర్థవంతంగా అమలుచేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వా శాఖ తెలిపింది.

Read Also: Niharika Konidela : 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

కంబోడియా కేంద్రంగా కొనసాగుతున్న సైబర్ నేరాల గురించి గత కొన్ని నెలల క్రితం మీడియాలో కథనాలు వచ్చాయి. దాదాపు 5 వేల మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోయారని.. వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపింది. డేటా ఎంట్రీ పోస్టులకు భారీ వేతనాల ఆశజూపి, సైబర్ మోసాలు చేయిస్తున్నారని వెల్లడైంది. టెలీకాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ చేసిన పలు మోసాలు బయటకు రావడంతో.. కేంద్రం మంత్రిత్వశాఖలతో కలిపి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం సెక్టార్లలో ఉన్న లోపాలను ఆ కమిటీ సభ్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించే ఇంటర్నేషనల్ కాల్స్‌ను బ్లాక్‌ చేయాలని కొన్ని నెలల క్రితం టెలికాం ఆపరేటర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version