Site icon NTV Telugu

Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం

Tejashwi Yadav

Tejashwi Yadav

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో ఈ సర్వేలు వచ్చాయన్నారు. ‘SIR’ సమయంలో గోడి మీడియా బీహార్‌లోకి ప్రవేశించి చేసిన సర్వేగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు

నవంబర్ 14న ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని.. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అంతక ముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయని.. ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!

మాకు అందుతున్న సమాచారం మేరకు ఫలితాలు మహా‌ఘట్‌బంధన్‌కు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. 1995 ఎన్నికల కంటే మెరుగ్గా ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహారీయులంతా అధికార కూటమిపై విసుగుపోయారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు రాబోతోందని.. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత నవంబర్ 6న జరగగా.. రెండో విడత నవంబర్ 11న జరిగింది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం (14-11-2025) విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే రంగంలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు.

Exit mobile version