Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ, వాష్ బేసిన్ కూడా తొలగించారు’’ అని ఆయన పేర్కొన్నాడు.
Read Also: Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!
దొంగిలించబడిన వస్తువులకు సంబంధించిన వివరాలను త్వరలోనే బీజేపీ విడుదల చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఈ బంగ్లాని కేటాయించారు. ఈ ఆరోపణల్ని ఆర్జేడీ ఖండించింది. తేజస్వీ యాదవ్ పరువు తీయడానికి బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ అన్నారు. నీచ రాజకీయాలు చేయడానికి తేజస్వీ యాదవ్ బెడ్, ఏసీలు దొంగిలించాడని బీజేపీ అబద్ధపు ఆరోపణలు చేస్తుందని అన్నారు. బీజేపీ తేజస్వీ యాదవ్ నుంచి ఏసీ, బెడ్ కోరుకుంటే వారికి ఇస్తామని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘‘తేజస్వీ యాదవ్ ఫోబియా’’తో బాధపడుతోందని అన్నారు.