Site icon NTV Telugu

Tejashwi Yadav: ఆర్జేడీలో గుబులు.. వెనుకంజలో ముఖ్యమంత్రి క్యాండిడేట్

Tejashwi Yadav

Tejashwi Yadav

ఎన్నో ఆశలు.. ఎన్నో ఊహలతో ఎన్నికల కథన రంగంలోకి దిగిన ఆర్జేడీ వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని.. ముఖ్యమంత్రి కావాలని తేజస్వి యాదవ్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ అంచనాలు రివర్స్ అయ్యాయి. లాలూ కుటుంబానికి కంచుకోట లాంటి రాఘోపూర్‌లో ప్రస్తుతం తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఇది ఆర్జేడీ జీర్ణించుకోలేని విషయం. ఇక మహువా నుంచి పోటీ చేస్తున్న తేజస్వి యాదవ్ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వెనుకంజలో ఉన్నారు. మొత్తానికి ఇద్దరు అన్నదమ్ములు కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇది లాలూ ఫ్యామిలీకి తీరని నష్టంగానే చెప్పొచ్చు. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే.. ఆర్డీడీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి: Bihar Elections Result: 200 మార్కు దిశగా ఎన్డీఏ.. తగ్గుతున్న ఆర్జేడీ లీడ్

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ఓట్ చోర్’’ యాత్ర పేరుతో కలియ తిరిగారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక మేనిఫెస్టోలో కూడా పెద్ద ఎత్తున హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. జీవికా దీదీలను పర్మినెంట్ చేసి రూ.30,000 జీతం ఇస్తామని ప్రకటించినా ప్రజలు నమ్మలేదు. ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుతం 200 మార్కు దిశగా ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది.

ఇది కూడా చదవండి: Bihar Election Results: కూటమిని ముంచిన కాంగ్రెస్.. హస్తం పార్టీ పేలవ ప్రదర్శన..

Exit mobile version