Site icon NTV Telugu

Bihar Elections: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన తేజస్వీ యాదవ్..

Bihar Elections

Bihar Elections

Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆర్జేడీల ‘‘మహాఘటబంధన్’’ కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్, రాబోయే ఎన్నికల్లో 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ముజఫర్‌పూర్ లోని కాంతిలో జరిగిన కార్యకర్తల ర్యాలీలో ఈ ప్రకటన చేశారు. ఇటీవల, రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ కలిసి బీహార్ వ్యాప్తంగా ‘‘ఓటర్ అధికార్ ర్యాలీ’’ నిర్వహించారు. రెండు పార్టీలు కూడా కలిసి సీట్లు పంచుకుంటాయని అంతా భావించారు. అయితే, సీట్ల పంపకాల్లో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

Read Also: Elon Musk: ‘‘హింస రాబోతోంది, తిరిగి పోరాడండి లేదా చనిపోండి’.. లండన్ నిరసనలపై మస్క్ సంచలనం..

‘‘మేము తిరిగి అధికారంలోకి వస్తాము. బీహార్‌లో 243 సీట్లలో పోటీ చేస్తాం’’ అని తేజస్వీ అన్నారు. ఇటీవల, బీహార్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించిన నేపథ్యంలో, రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. తాజా, కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే ప్లాన్‌లో భాగంగా తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తు్న్న సమయంలో, కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ సీట్ల పంపకాలపై చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను కోరుతోంది. దీనిపై ఆర్జేడీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version