NTV Telugu Site icon

Tejashwi Yadav: ఎన్నికలప్పుడే మోడీకి బీహార్ గుర్తొస్తుంది

Tejashwiyadav

Tejashwiyadav

ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్.. మోడీ టూర్‌ను ఉద్దేశించి 15 ప్రశ్నలు సంధించారు.

ఇది కూడా చదవండి: Manchu Lakshmi: మొత్తానికి భర్తతో విడిపోవడం పై నోరు విప్పిన మంచు లక్ష్మి !

బీహార్ ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా.. రాష్ట్రం బాగుపడలేదన్నారు. కేంద్రంలో మోడీ 11 సంవత్సరాలు, నితీష్ కుమార్ 20 సంవత్సరాలు పాలించినా బీహార్ బాగుపడలేదన్నారు. ఇంకా బీహార్ అట్టడుగునే ఉందన్నారు. తలసరి ఆదాయం, పెట్టుబడిలో బీహార్ అత్యల్ప స్థానంలో ఉందని చెప్పారు. ఆదాయంలో బీహార్‌లో అత్యల్ప స్థానంలో ఉంటే.. నిరుద్యోగం, వలసలు, పేదరికంలో బీహార్ మొదటి స్థానంలో ఉందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Harish Rao: టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!

‘ప్రత్యేక హోదా’తోనే బీహార్ బాగు పడుతుందని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. 2017లో మోతీహారీ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తానని, దాని చక్కెరతో టీ తాగుతానని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు… ఈ టీ ఎప్పుడు తాగుతారో ఆయన మాకు చెబుతారా? కతిహార్‌లో జనపనార మిల్లును ఎప్పుడు ప్రారంభిస్తారు?,’’ అని అడిగారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
బీహార్ 2025 ఎన్నికలు అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి. 2020 ఎన్నికల్లో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రాష్ట్రంలోని 234 సీట్లలో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 43, కాంగ్రెస్ కేవలం 19 స్థానాలు గెలుచుకుంది.