Site icon NTV Telugu

Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..

Tej Pratap Yadav

Tej Pratap Yadav

Tej Pratap Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన గర్ల్‌ఫ్రెండ్ గురించి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. అనుష్క యాదవ్‌తో తనకు ఉన్న సంబంధాన్ని శనివారం ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా బయటపెట్టాడు. అనుష్క యాదవ్ గత 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, రిలేషన్ కొనసాగిస్తున్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు.

Read Also: Udhayanidhi Stalin: “ప్రధాని, ఈడీకి భయపడం”.. నీతి ఆయోగ్ మీటింగ్‌కి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..

‘‘నేను తేజ్ ప్రతాప్ యాదవ్ ని, ఈ ఫోటోలో నాతో కనిపిస్తున్న వ్యక్తి అనుష్క యాదవ్! మేము గత 12 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నాము, ప్రేమించుకుంటున్నాము. మేము గత 12 సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నాము’’ అని తేజ్ ప్రతాప్ యాదవ్ తన పోస్టులో చెప్పారు. ‘‘చాలా కాలంగా దీన్ని మీ అందరితో చెప్పాలని అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి ఈ రోజు, ఈ పోస్ట్ ద్వారా నా హృదయంలో ఉన్నది అందరికి తెలియజేస్తున్నాను. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

తేజ్ ప్రతాప్ యాదవ్ పోస్టు ఇప్పుడు అందరి ద‌ృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఈ సంబంధం వివాహం వైపు వెళ్తుందా..?అని తెలుసుకోవాలని అనుకున్నారు. ఆర్జేడీ నేత ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. మాల్దీవుల్లో గడుపుతున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాలో సముద్ర తీరంలో ధ్యానం చేస్తున్న వీడియోని షేర్ చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. హసన్‌పూర్ నుంచి మహువాకు మారడానికి సిద్ధమయ్యారు. 2015లో ఆయన మహువా నుంచి గెలిచారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గానికి తిరిగి రావాలని అనుకుంటున్నారు.

Exit mobile version