NTV Telugu Site icon

Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీక్-ఎ-హురియత్’పై కేంద్రం ఉక్కుపాదం..

Tehreek E Hurriyat

Tehreek E Hurriyat

Tehreek-e-Hurriyat: కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ ‘తెహ్రీత్-ఎ-హురియత్(TeH)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)ని ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థకు గతంలో వేర్పాటువాద నాయకుడు, మరణించిన సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు.

Read Also: Rave Party: థానేలో రేవ్ పార్టీ.. న్యూ ఇయర్ వేడుకల్లో 100 మంది అరెస్ట్..

జమ్మూ కాశ్మీర్‌ని భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలన నెలకొల్పాలనే కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక ప్రచారానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ ‘జీరో టాలరెన్స్’ పాలసీని అవలంభిస్తున్నారని, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏ వ్యక్తిని, సంస్థను ఉపేక్షించేది లేని అమిత్ షా ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో ముస్లింలీగ్ జమ్మూ కాశ్మీర్(మసరత్ ఆలం వర్గం)(MLJK-MA) దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న కారణంగా, ఇస్లామిక్ పాలన స్థాపించేందుకు ప్రజల్ని ప్రేరేపిస్తున్నందున ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఈ సంస్థను కేంద్రం నిషేధించింది. ఇది జరిగిన తర్వాత తాజాగా తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధాన్ని ప్రకటించింది.